నెయ్యి కొంటున్నారా.. సజ్జనార్ హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్: బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసిన నెయ్యి అంటూ కల్తీని జనాలకు అంటగడుతున్నారని, కొనే ముందు చెక్ చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ (VC Sajjanar) హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 25 టన్నుల కల్తీ నెయ్యి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మీడియాకు వివరాలు వెల్లడించారు. నకిలీ నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల కల్తీ పామాయిల్, 600 లీటర్ల కల్తీ డాల్డా, 30 కిలోల కల్తీ స్టార్చ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

తక్కువ ధరకు దొరుకుతుందని..

పాలు లేకుండానే నెయ్యి తయారు చేస్తున్నారని, పూర్తిగా రసాయనాలతో కృత్రిమంగా చేసి.. ప్యాకెట్లలో అమర్చి విక్రయిస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరైనా దేశీ నెయ్యి, వంద శాతం ఆవు పాలతో తయారు చేసిందని తక్కువ ధరకే అమ్మాలని చూస్తుంటే కొనుగోలు చేయొద్దన్నారు. సువాసన వచ్చినంత మాత్రాన అది నిజమైన నెయ్యి కాదని, కల్తీ చేయడానికి కేటుగాళ్లు ఏదైనా చేస్తారని పేర్కొన్నారు. కొనే ముందు కచ్చితంగా కంపెనీ పేరు, క్వాలిటీ, ఎప్పుడు తయారైంది, గడువు కూడా చూడాలన్నారు. ఆహార కల్తీపై ఫుడ్ సేఫ్టీ విభాగాలతో కలిసి హైదరాబాద్ సిటీ పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని సీపీ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>