కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణమాసంలో మొదటి మంగళవారం కావడంతో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బోనాలతో దేవాలయ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు.. ఒడి బియ్యం పోసి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

