ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. కీలక బిల్లులపై చర్చ

కలం, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశం ప్రారంభం అయింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై మంత్రి వర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు 24.15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై కేటీనెట్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా కేబినెట్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని కీలక బిల్లులు, ప్రతిపాదనలపై కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>