ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవోల గళం

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (TNGOs) కేంద్ర సంఘ కార్యాలయం నాంపల్లిలో(Nampally) టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అధ్యక్షతన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ముజీబ్ హుస్సేన్ కార్యనిర్వహణలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ తదితర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కార్యవర్గం దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించారు. పెన్షన్ విధానంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లోని లోపాలను తక్షణమే సవరించి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర ఆర్థిక ప్రయోజనాలను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలని సమావేశం తీర్మానించింది.

తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో టీఎన్జీవోల జెండా, కండువాను ఆవిష్కరించడం శుభసూచకమని నాయకులు పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ఇందుకు కేంద్ర సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల గొంతుకగా నిలిచే జీవితకాల చందా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సభ్యుల నుంచి సేకరించిన రూ.2.82 లక్షల విలువైన చెక్కును కేంద్ర సంఘ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా సంఘం చేసిన కృషిని కేంద్ర సంఘ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంఘము లక్ష్మణరావు, సర్దార్ అరవింద్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొంకూరు శంకర్, సందీప్ రెడ్డి, మిర్యాల నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>