స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ముద్రించాలి: బీజేపీ

కలం, జోగులాంబ గద్వాల: తెలంగాణలో నూతనంగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా‌ కలెక్టరేట్‌ ముందు బీజేపీ నాయకులు (Gadwal BJP) నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు అందే ప్రతి ఆరు కిలోల రేషన్ బియ్యంలో ఐదు కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కార్డుపై ప్రధాని మోదీ ఫోటోను తొలగించడం కేంద్రాన్ని అవమానించడమేనని ఆరోపించారు. ప్రధాని ఫోటో లేకుండా కార్డుల పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవి కుమార్, శ్యామ్ రావ్, జిల్లా (Gadwal BJP) ఉపాధ్యక్షుడు బలిగేరా నల్లారెడ్డి, దామ నాగరాజుబాలేశ్వర్ రెడ్డి, జిల్లా బీజెవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత మధుగౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు దరూర్ కిష్టన్న, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహ, కౌన్సిలర్లు కుమ్మరి శ్రీనివాసులు, శాలన్న, చంద్ర శేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు నర్సన్ దొడ్డి క్రిష్ణ రెడ్డి, హానిమి రెడ్డి, మళ్ళెం దొడ్డి వెంకటేస్వర రెడ్డి, పాల్వాయి రాముడు, హన్మంత రాయ, అనిల్, శ్రీమన్నారాయణ, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ వార్డు ఇంచార్జ్ లు , బీజేపీ సీనియర్ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : నర్సింగ్ చేసిన వారికి విదేశాల్లో డిమాండ్: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>