కలం, జోగులాంబ గద్వాల: జిల్లాలోని ధరూర్ మండల పరిధి పెద్ద చింతరేవుల (Pedda Chintarevula) గ్రామంలో 18వ శతాబ్దం నాటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నాగపంచమి వేడుకలు జరిగాయి. జంటనాగులకు ఉడిపి పాలిమర్ మఠం పీఠాధిపతులు శ్రావణ సోమవారం నాగ పంచమి సందర్భంగా ప్రత్యేకంగా అభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. నాగ పంచమి రోజు జంట నాగులకు పూజించినా, అభిషేకించినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకటాక్షం వారి కుటుంబంపై ఉంటుందని అన్నారు.
పాలిమర్ పీఠాధిపతులు 1008 విద్యాదిశ శ్రీపాదుల వారు, 1008 విద్యా రాజేశ్వర శ్రీపాదుల వారు శ్రావణ సోమవారం మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జంట నాగుల స్వామి వారికి ప్రత్యేకంగా పంచామృత, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు శాస్త్రోక్తంగా చేశారు. జంట నాగుల స్వామివారిని పూజించిన అభిషేకించిన భక్తులకు విశేష విజ్ఞానం కలిగిన సుపుత్ర సంతానం, అష్ట ఐశ్వర్యాలు, జ్ఞానం,కీర్తి ప్రాప్తిస్తుందని అన్నారు. పెద్ద చింతరేవుల (Pedda Chintarevula) అన్న ప్రసాద ట్రస్ట్ వారిచే పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆద్య వామనచారి, ఆద్య కిష్టాచారి,ఆద్య మద్వాచారి, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘క్షుద్రపూజలు’
Follow Us On: X(Twitter)

