కలం, వెబ్ డెస్క్: ముంబై (Mumbai) లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చ్ గేట్ ప్రాంతంలో ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయంలో సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. 12 ఫైరింజన్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

