ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్ హోదా.. ఉత్తర్వులు జారీ!

కలం, వెబ్ డెస్క్: ఏపీలో హరిత విస్తరణ, అటవీ పునరుద్ధరణ కోసం  కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ (AP-GREEN) సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చెర్మన్‌గా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Nagababu)ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నాగబాబుకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఏపీ పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, అటవీ పునరుద్ధరణ, భారీ స్థాయిలో మొక్కల పెంపకం, పచ్చదనం విస్తరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంలో ఏపీ గ్రీన్ సొసైటి కీలక పాత్ర పోషించనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెర్మన్ గా ఉన్న ఈ సొసైటీ ద్వారా 2027 నాటికి రాష్ట్రంలో 50 శాతం ఫారెస్ట్, ట్రీ కవర్ సాధించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>