హైదరాబాద్ సిటీ పోలీస్‌లో ఉద్యోగాలు.. వారే అర్హులు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ సిటీ పోలీస్‌ (Hyderabad City Police)లో 150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO)గా పిలిచే ఈ ఉద్యోగాలకు రిటైర్డ్ పోలీసులు, మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ జవాన్లు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శాంతి భద్రతల్లో ప్రత్యేకత దృష్ట్యా కొంత మందిని తాత్కాలికంగా విధుల్లోకి తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.26 వేల గౌరవ వేతనం అందిస్తారు. అయితే, వేతనంతో కూడిన సెలవులు మాత్రం ఉండవు.

కావాల్సిన సర్టిఫికేట్లు ఇవే..

ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేట్లబురుజులోని సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉంది. అప్లై చేసుకునే సమయంలో, అభ్యర్థి రిటైర్మెంట్ ఆర్డర్, డిశ్ఛార్జ్ బుక్, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా బుక్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి కచ్చితంగా లైట్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. లేకపోతే పరిగణనలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు.

Also Read : మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>