Toxicలో బోల్డ్ సీన్స్.. యశ్ భార్య రాధికా రియాక్షన్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: టాక్సిక్ విడుదలకు ముందు హీరో యశ్ (Yash) తన భార్య రాధికా పండిట్.. బోల్డ్ సీన్స్‌పై ఎలా రియాక్ట్ అయ్యారో తెలిపారు. ఇలాంటి సన్నివేశాలు ఏ భార్యకైనా అసౌకర్యంగా అనిపిస్తాయని, అయితే తాము ఇద్దరం కూడా వాటిని వృత్తిలో భాగంగా అర్థం చేసుకుంటామని యశ్ తెలిపారు. జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్ కీ అదాలత్‌లో రాధికా పండిట్ (Radhika Pandit) స్పందన గురించి యశ్ మాట్లాడారు. ఇలాంటి సన్నివేశాల విషయంలో ప్రతి భాగస్వామి అసౌకర్యంగా భావించడం సహజమేనని, అయితే సినిమాలో భాగమేనన్నారు. నటుడి వృత్తి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కథకు ఈ సన్నివేశాలు ఎంతో కీలకమని, అందుకే వాటిని చిత్రీకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

తాను కూడా తన కంఫర్ట్ జోన్‌ నుంచి బయటకు వచ్చి ఈ సన్నివేశాల్లో నటించానని యశ్ తెలిపారు. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు కూడా అంత ఈజీ కాదని, అయితే కథ డిమాండ్ చేయడంతో చేయాల్సి వచ్చిందన్నారు. రాధికా ఈ విషయంపై సంతోషంగా ఉండకపోవచ్చని, కానీ అందుకు ఆమె తనపై కోపంగా లేదని చెప్పారు. ఆమె కూడా ఒక నటి కావడంతో అర్థం చేసుకుంటుందని యశ్ వివరించారు. తాను నటిస్తున్న సమయంలో తెరపై కనిపించేది తన భర్తగా కాకుండా ఒక నటుడిగా చేసిన పాత్ర అని ఆమెకు తెలుసని అన్నారు.

ఇదిలా ఉండగా, Toxicలోని సన్నిహిత సన్నివేశాలపై నటి కియారా అద్వానీ (Kiara Advani) గతంలో సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఆమె నటనకు అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. యశ్ (Yash) కియారాకు మద్దతుగా మాట్లాడుతూ.. ఒక నటుడు తాను నమ్మినదాన్ని చేయాలని, ప్రేక్షకులు తొలుత అర్థం చేసుకోకపోయినా తర్వాత ప్రశంసిస్తారని హీరో యశ్ అన్నారు.

Also Read : మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>