కలం, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బాడీగార్డ్ కెవిన్ కుంటా (Kevin Kunta) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రామ్ చరణ్ కెవిన్‌ను తన బాడీగార్డ్ స్థానం నుంచి తొలగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్ది సినిమా సమయంలో కెవిన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రామ్ చరణ్‌కు భద్రత కల్పిస్తూ కెవిన్ తీసుకున్న జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. అతడి ఆహార్యం ఒక హాలీవుడ్ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ లేదని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
కెవిన్‌కు ఓ హీరోకు ఉన్నంత క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా భారీగా పెరిగారు. చరణ్ బయటకు వచ్చినప్పుడల్లా కెవిన్ (Kevin Kunta) కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేసే వాళ్లు. పోటీ పడి మరీ అతడితో ఫోటోలు దిగే వారు. అయితే కెవిన్ ను చరణ్ ఎందుకు తొలగించాడన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే బాడీ గార్డ్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను చూసే చరణ్ తొలగించాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) కెవిన్‌ను తన బాడీగార్డ్‌గా నియమించుకున్నారని రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ ఫేక్ అని, వాస్తవానికి వర్క్ వీసా గడువు ముగియడంతో తాను స్వదేశానికి వెళ్లిపోయాడని కొందరు చెప్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Toxicలో బోల్డ్ సీన్స్.. యశ్ భార్య రాధికా రియాక్షన్ ఇదే!
Follow Us On: Instagram

