కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham)ను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాల విస్తరణతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.

