కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలో శనివారం పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy) పాల్గొన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రుచులు’ హోటల్‌ను ఆయన ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న వనపర్తిలో ఇటువంటి హోటళ్ల ఏర్పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. హోటల్ నిర్వాహకుడు సర్వేశ్వర్‌రెడ్డిని అభినందిస్తూ.. అన్నదానం అన్నింటికంటే గొప్పదని, వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు.
ఎమ్మెల్యేపై రచించిన పాట ఆవిష్కరణ
అనంతరం మర్రికుంటలోని మీసాల రామన్నకు చెందిన అక్షయ రికార్డింగ్ స్టూడియోలో నాగేంద్రసాగర్ రచించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై పాటను ఆయన ఆవిష్కరించారు. తనపై అభిమానంతో పాటను రచించిన నాగేంద్రసాగర్‌ను ఎమ్మెల్యే అభినందించారు.
మాజీ మున్సిపల్ చైర్మన్‌కు పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేశ్‌ను ఎమ్మెల్యే ఆయన నివాసంలో పరామర్శించారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో పుర చైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

