కలం, నిర్మల్: ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (Khanapur Govt Hospital) లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వర్ణ రెడ్డి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

