అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అడ్లూరి స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా సన్మానించారు.

కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రసంశ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించే అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు.

పౌరసరఫరాల శాఖ ద్వారా కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 58 వేల లబ్దిదారులకు 9 లక్షల 23 వేల 755 గ్యాస్‌ సిలిండర్లను రూ. 500లకు సరఫరా చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఇందుకు గాను 29 కోట్ల 78 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు. ‘రైతుభరోసా’ పథకం ద్వారా ఈ వానాకాలం పంటకు గాను ఒక లక్షా 92 వేల 628 మంది రైతులకు రూ . 206 కోట్ల 82 లక్షల లను జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సన్నరకం ధాన్యం విక్రయించిన 28 వేల 659 మంది రైతులకు 71 కోట్ల 17 లక్షల రూపాయల బోనస్ జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

జిల్లాలో మొదటి విడతలో 10 వేల 506 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే 8 వేల 557 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గృహ నిర్మాణాన్ని బట్టి దశలవారీగా ప్రభుత్వం 222 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

జిల్లాలో ఒక లక్ష 32 వేల 229 మంది లబ్దిదారులకు ప్రతి నెలా 30 కోట్ల 60 లక్షల రూపాయల చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన మరింత మందికి కొత్త పింఛన్లు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఈ నేపథ్యంలో జిల్లాలో అర్హులందరికీ కొత్త పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 47 వేల 138 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయడం జరిగింది.

97 వేల 13 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 22 వేల 198 కుటుంబాలకు గాను ప్రతి నెలా 6 వేల 63 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియను ప్రారంభించడం సంతోషకరమైన విషయమని రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.

చొప్పదండి మండలం కోనేరుపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని మంత్రి తెలిపారు. సర్పంచుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. ఈ నెల 17 నుండి మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శ్రీపాద ఎల్లంపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల అనుబంధ పనులకు సంబంధించి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరు తడి పంటలు, పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతులకు దీర్ఘకాలం ఆదాయం వచ్చే ఆయిల్ ఫాం పంటలు ప్రోత్సహించి సబ్సిడీ అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా పరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అడ్లూరి అన్నారు.

ఇందులో భాగంగా గత ఏడాది జిల్లాలో 6 వేల 130 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ వానాకాలంలో ఇప్పటివరకు 19 వేల 135 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం జరిగిందని, ఈ వానాకాలం పంట కోసం 39 వేల 277 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 22 వేల 714 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 2 కోట్ల 20 లక్షల చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు ప్రక్రియ ప్రారంభించామని మంత్రి అడ్లూరి అన్నారు. తద్వారా జిల్లాలో 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 17 వేల 996 మంది విద్యార్థులకు 22 కోట్ల 82 లక్షల రూపాయల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందజేశామని మంత్రి వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం అమలుకు 50 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వంద శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని ఓటర్లు తిరిగి సమర్పించిన 83.74 శాతం ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>