వనపర్తి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు

కలం, వనపర్తి: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి (Wanaparthy) బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, కె.మాణిక్యం, రఘుపతిరెడ్డి, గంధం బాలపీరు, గంధం పరంజ్యోతి, జాతృ నాయక్, గులాం ఖాదర్ ఖాన్, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, జింకల హరిబాబు, జోహెబ్ హుస్సేన్, నాగన్న యాదవ్, స్టార్ రహీమ్, మహేశ్వర్‌రెడ్డి, ఇమ్రాన్, నీలస్వామి, శిరీవాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ ప్రారంభించిన‌ సీఎం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>