మహనీయుల త్యాగాల స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన (MLA Alleti) మాట్లాడుతూ.. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. వారి స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సుస్థిర పాలనకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, సాధం అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్, జింక సూరి, కూన శశాంక్, రావులవార్ విఠల్, సూరజ్ నాయక్, నాయకులు సాత్విక్, ఈశ్వర్, అర్జున్ అలివేలు మంగ, నారాయణ గౌడ్, కందుల హరీష్, జాప ప్రసాద్, జుట్టు దినేష్, అల్లం భాస్కర్, ఓడ్నాల రాజు, గిల్లి విజయ్‌ తో పాటు పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : సంక్షేమం అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజ : సుదర్శన్​ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>