కలం, వెబ్ డెస్క్ : తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్టైజీపై స్పీచ్ ఇస్తున్న వేళ మంత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన పక్కకు వాలిపోయే సమయంలో పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది.
భద్రతా సిబ్బంది మంత్రిని కింద పడకుండా పట్టుకుని కూర్చోబెట్టారు. అనంతరం వైద్యులు మంత్రికి చికిత్స అందించారు. మంత్రి బీపీ డౌన్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు గంటసేపు నిల్చొని మాట్లాడడంతో బీపీ తగ్గినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
Also Read : భారతీయుల చూపు.. సింహళం వైపు: ఫారిన్ టూరిజంలో టాప్ ప్లేస్
Follow Us On: X(Twitter)

