స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. త్రివర్ణ శోభలో ఏడుపాయల వన దుర్గమ్మ!

కలం, మెదక్ బ్యూరో: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ, మెదక్ (Medak) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం (Edupayala Temple) ఆధ్యాత్మిక, దేశభక్తి శోభతో విలసిల్లుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రత్యేక అలంకరణ చేశారు.

​త్రివర్ణ రంగుల పూలతో అద్భుత అలంకరణ

జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల పూలతో అమ్మవారిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు అమ్మవారు ఈ మూడు రంగుల జాతీయ జెండా ఆకృతిలో దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Also Read : బీజేపీకి బీసీ సెగ.. పార్లమెంటులో హమీ.. కానీ!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>