కలం, వెబ్‌డెస్క్: విద్యా సంస్థల్లో విద్యార్థులతో ఉపాధ్యాయులు పనులు చేయించడంపై ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఓ టీచర్ విద్యార్థినితో జడ వేయించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం (Mahamoodpatnam KGBV)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ అర్చన పదో తరగతి విద్యార్థినితో జడ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేజీబీవీ హాస్టల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. టీచర్ విద్యార్థినితో వ్యక్తిగత పనులు చేయించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జడ వేయించుకుంటూనే మరో విద్యార్థినిని టీచర్ బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థినితో జడలు వేయించుకున్న టీచర్..
-మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కేజీబీవీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ అర్చన నిర్వాకం
– టెన్త్ క్లాస్ విద్యార్థినితో జడలు వేయించుకున్న టీచర్
-ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Teacher Forces… pic.twitter.com/thjGpZPq5S— Kalam Daily (@kalamtelugu) August 14, 2026

