కలం, హనుమకొండ: కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ (Chahat Bajpai) అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల జాప్యంలో అలసత్వాన్ని సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఎస్ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, తదితరులు పాల్గొన్నారు.

