కలం, కరీంనగర్: కరీంనగర్ కిమ్స్ కాలేజీ (Karimnagar KIMS)లో పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ తరఫున పాల్గొని నషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఈగల్ టీం డీఎస్పీ ఉపేందర్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్, కిమ్స్ కాలేజ్ (Karimnagar KIMS) వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, మిషన్ వాత్సల్య సిబ్బంది సాదినేని రమేశ్, స్వప్న, త్రీ టౌన్ సీఐ తిరుమల్ పాల్గొన్నారు.
Also Read : ధోనీ మంత్రంతో బిచు దేవి వరల్డ్ కప్‌కు రెడీ
Follow Us On: X(Twitter)

