కలం, కరీంనగర్ బ్యూరో: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ (Karimnagar)లో బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం రోజున భారీ తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్ తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రామ్‌నగర్ వరకు కోలాహలంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ.. ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ ప్రాముఖ్యత ను ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ అనేది దేశవ్యాప్తంగా పౌరుల్లో జాతీయ భావాలను ఇనుమడింపజేయడానికి చేపట్టిన ఒక గొప్ప ఉద్యమం లాంటిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ స్పూర్తి కలిగి ఉండాలని, దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు.
బిజెపి జిల్లా (BJP Karimnagar) అధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ఈ ర్యాలీ ద్వారా కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు జాతీయ జెండా గొప్పతనాన్ని వివరించడమే కాకుండా, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ ప్రోగ్రాం లో మాజీ శాసనసభ్యులు బుడిగే శోభ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళపు రమేశ్, బంగారు రాజేంద్రప్రసాద్, ఇ నుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, గుజ్జ శ్రీనివాసరావు, వాసాల రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలాదేవి, యువ మోర్చా అధ్యక్షులు సంఘ నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మోతె గంగారెడ్డి, ఓబిసి మోర్చా అధ్యక్షులు ఆకుల రాజేందర్, మైనారిటీ మోర్చా అధ్యక్షులు పర్వేజ్, ముజీబ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, ఎస్టి మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్ లతోపాటు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల, జోన్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ కళాశాలలో చెందిన విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
Also Read : రాహుల్ గాంధీకి షాక్.. నోటీసులు జారీ!
Follow Us On: Instagram

