కలం, వెబ్ డెస్క్: నిషేధిత జాబితాలో ఉన్న భూములను వెంటనే క్లియర్ చేయాలని తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) నిర్ణయించింది. ప్రభుత్వ భూమి కాకుండా సాధారణ ప్రజల భూమి 22/A కింద నమోదై ఉంటే.. సంబంధిత యజమానుల పేరు మీద వెంటనే నమోదు చేసే ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ మేరకు క్యూర్ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం నాటికి ఎవరి భూమి నిషేధిత జాబితాలో ఉందో.. వెబ్ సైట్‌లో పొందుపర్చనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భూముల గురించి భయపడాల్సిన అవసరం లేదని, కష్టపడి సంపాదించుకున్న భూమి ఎక్కడికి పోదని.. అందుకు తమ ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందన్నారు.
రైతులకు బోనస్‌పై..
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వంగడాలను సాగు చేసుకున్న రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా చెల్లించాలని కేబినెట్ (Telangana Cabinet) నిర్ణయించింది ఈ మేరకు వారంతా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తెలంగాణ ఇన్వెస్ట్ థీమ్ నిర్వహణ..
ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో తెలంగాణ ఇన్వెస్ట్ థీమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఫోర్త్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నియమించింది.
Also Read : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం కీలక ప్రకటన!
Follow Us On: Sharechat

