కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 13న అసౌకర్యంగా అనిపించడంతో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నడ్డా ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 13న అస్వస్థత కారణంగా వైద్య పరీక్షలు నిర్వహించామని.. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు కరోనరీ యాంజియోగ్రఫీతో పాటు పలు పరీక్షలు చేశామని తెలిపింది. ప్రస్తుతం జేపీ నడ్డా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వివరించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన నడ్డా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : గ్రేటర్లో ‘సర్’ ఎఫెక్ట్.. గులాబీ పార్టీకి గుబులు!
Follow Us On : WhatsApp

