డ్వాక్రా మహిళకు శుభవార్త.. రూ.3 లక్షల వరకు రుణం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని డ్వాక్రా మహిళలకు (DWCRA Women) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు ప్రయోజనం కల్పించే కీలక పథకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం, స్త్రీనిధి పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అమరావతిలో డ్వాక్రా మహిళలకు ప్రయోజనం కల్పించే కీలక పథకాన్నికూటమి ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) తెలిపారు. డ్వాక్రా మహిళలు ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోందని వెల్లడించారు.

పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

డ్వాక్రా (DWCRA) మహిళలను ఉపాధి కల్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెరుగుతాయాని.. వారి కుటుంబ ఆదాయాన్ని సైతం పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర పథకమై పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని స్త్రీనిధితో అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.

ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాట్లు..

అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు రుణంతో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. పండ్లు, కూరగాయలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, చిరుధాన్యాలు, పిండి పదార్థాలు, స్నాక్స్‌ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. ఆసక్తి, సామర్థ్యం ఉన్న మహిళలను గుర్తించి, రుణంతో పాటు బిజినెస్ లాభాలు గడించే విధంగా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందన్నారు.

Also Read : ర్యాంప్ వాక్ అదరగొట్టిన మాజీ నక్సల్స్.. నెటిజన్లు ఫిదా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>