కలం, నిర్మల్: కష్టకాలంలో కన్నీటి కుటుంబానికి అండగా నిలిచి రవి ఫౌండేషన్ (Ravi Foundation) మానవత్వాన్ని చాటుకుంది. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గొల్లపేట్ కాలనీకి చెందిన ఆశన్న అనే ఆటో డ్రైవర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో పలువురు దాతలు స్పందించి తమవంతు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
శుక్రవారం నిర్వహించనున్న పెద్దకర్మకు సైతం అవసరమైన నిత్యావసర వస్తువులు సమకూర్చుకునే పరిస్థితి లేదని తెలుసుకున్న రవి ఫౌండేషన్ (Ravi Foundation) చైర్మన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ ఆశన్న కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దకర్మ నిర్వహణకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) చేస్తున్న సేవ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని పెద్దకర్మకు అవసరమైన సామగ్రిని అందించిన రవికుమార్‌కు కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సయ్యద్ అజరుద్దీన్, బిక్కి దినేష్ కుమార్, నిగులపు లింగన్న, జాన అఖిలేష్, కొంతం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ర్యాంప్ వాక్ అదరగొట్టిన మాజీ నక్సల్స్.. నెటిజన్లు ఫిదా!
Follow Us On: X(Twitter)

