ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని అమరావతిలో రూ.40 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన 58 అత్యాధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు జెండా ఊపి ప్రారంభించారు.

సీఎం చంద్రబాబు ప్రారంభించిన 58 వాహనాల్లో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు క్విక్ రెస్పాన్స్ వాహనాలు కీలకంగా పనిచేయనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్త నష్టాలను మరింత వేగంగా నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఆధునిక శకటాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>