కరీంనగర్‌లో పోలీసుల విస్తృత నాకాబందీ.. 82 వాహనాలు సీజ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్, రూరల్, హుజురాబాద్ డివిజన్లలో పోలీసులు విస్తృతంగా నాకాబందీ (Nakabandi) నిర్వహించారు. నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీ, ట్రాఫిక్ నిబంధనల అమలు లక్ష్యంగా గురువారం పలు ప్రధాన కూడళ్లు, రహదారులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

నాకాబందీలో భాగంగా మొత్తం 128 స్పాట్ చలాన్లు విధించి రూ. 25,700 జరిమానా విధించారు. అలాగే 78 డీడీ కేసులు నమోదు చేసి, 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 8 నాలుగు చక్రాల వాహనాలు, 45 ద్విచక్ర వాహనాలు, 6 ఇతర వాహనాలు ఉన్నాయి. అదనంగా 4 ఈ-పెట్టి కేసులు నమోదు చేశారు. పెండింగ్ చలాన్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రూ. 87,000 విలువైన పెండింగ్ చలాన్లను గుర్తించారు.

డివిజన్ల వారీగా

– కరీంనగర్ టౌన్ డివిజన్: 45 స్పాట్ చలాన్లు, రూ.9,900 జరిమానా, 21 వాహనాలు స్వాధీనం.
– కరీంనగర్ రూరల్ డివిజన్: 31 స్పాట్ చలాన్లు, రూ.8,000 జరిమానా, 23 వాహనాలు స్వాధీనం; రూ.87,000 పెండింగ్ చలాన్లు గుర్తింపు.
– హుజురాబాద్ డివిజన్: 52 స్పాట్ చలాన్లు, రూ.7,800 జరిమానా, 38 వాహనాలు స్వాధీనం, 2 ఈ-పెట్టి కేసులు.

నేరాల నియంత్రణతో పాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా నాకాబందీ, వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని కరీంనగర్ పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>