బాసర ఎత్తిపోతలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం

కలం, నిర్మల్: బాసర ఎత్తిపోతల పథకం (Basara Lift Irrigation) పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో గురువారం బాసర ఎత్తిపోతల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా పోగుల రాజేశ్వర్, గౌరవ అధ్యక్షులుగా ఎండీ అస్గర్, వైస్ చైర్మన్‌గా నానం విజయ్, కోశాధికారిగా గుసుల రాజును నియమించారు. ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చూడటం, నీటి పంపిణీలో సమన్వయం, కాలువల నిర్వహణ, మరమ్మతులు చేపట్టడం కమిటీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రతి రైతుకు సమానంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>