నిర్మల్‌లో అఖండ భారతమాత పూజ

కలం, నిర్మల్: అఖండ భారత సంకల్ప దివస్‌ను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూవాహిని (Hindu Vahini) నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అఖండ భారతమాత పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నగర అధ్యక్షుడు మంద పవన్ తెలిపారు. స్థానిక వివేక్ చౌక్ సమీపంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో హిందూవాహిని నాయకులు, హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంద పవన్ కోరారు. అఖండ భారత సంకల్ప దివస్ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>