హార్దిక్ పాండ్యా స్ఫూర్తితో దైఖో దాస్ దూకుడు!

కలం, స్పోర్ట్స్ : అసోమ్ ప్రీమియర్ లీగ్‌లో(Assam Premier League) దిబ్రూగఢ్ వారియర్స్ ఆల్‌రౌండర్ దైఖో దాస్ (Doikho Das) అదరగొడుతున్నాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను(Hardik Pandya) తన రోల్ మోడల్‌గా భావిస్తున్నట్లు దాస్ తెలిపాడు. అతడి ప్రదర్శనతో దిబ్రూగఢ్ వారియర్స్ ఆరు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేట్ 7.80గా ఉంది. చరైడియో సన్‌రైజర్స్‌పై 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం ఈ సీజన్‌లో అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.

హార్దిక్ పాండ్యానే స్ఫూర్తి

హార్దిక్ పాండ్యా ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని దైఖో దాస్ చెప్పాడు. అతడి తరహాలో దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా షార్ట్ బాల్‌ను తన ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నానని చెప్పాడు. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో షార్ట్ బాల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు వివరించాడు. ఇప్పటివరకు బంతితో సత్తా చాటిన దాస్.. బ్యాట్‌తోనూ రాణించాలని ఎదురుచూస్తున్నాడు. తనకు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని, అవకాశం లభిస్తే రెండు విభాగాలలోనూ జట్టుకు ఉపయోగపడాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

జట్టు విజయమే లక్ష్యం

తన విజయానికి కారణం చాలా సింపుల్‌గా ఉండటమేనని దాస్ చెప్పాడు. బ్యాటర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. సరైన ప్రాంతంలో బంతిని వేయడంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని దైఖో దాస్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకు తన ప్రదర్శనతో పూర్తిగా సంతృప్తి చెందలేదని, జట్టు మరింత ముందుకు వెళ్లేందుకు తన ఆటను మెరుగుపరుచుకోవడమే లక్ష్యమని చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>