కలం, అలంపూర్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. అలంపూర్ (Alampur)కు చెందిన చాకలి శాలన్న(30) కోర్టులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. శాలన్న తన భార్యతో గొడవ పడి తీవ్ర మనస్తాపంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

