తెలంగాణపై చేతబడి చేస్తున్నారు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణపై చేతబడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారు. అఘోరాలతో పూజలు చేస్తున్నారని.. పదేళ్లు పాలించిన వ్యక్తులు ఇలాగేనా చేసేది.. అని ప్రశ్నించారు. తన వైపే దేవుడు ఉన్నాడని, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పమే తనను కాపాడుతుంటుందన్నారు. చేతబడి తిరగబడితే అష్ట దిగ్బంధనం చేస్తుందన్నారు. ఇప్పటికే ఫాంహౌస్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

నిషేధిత భూములపై కీలక ప్రకటన..

రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూములపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 22/A లో చిక్కుకున్న భూములను విడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రార్ అధికారులకు ఆదేశాలిస్తానని.. మీ భూమికి ముఖ్యమంత్రిగా తనదే హామీ అని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూమి విషయంలో జరగుతున్న ఇబ్బందులపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>