భువనగిరిలో విషాదం: విద్యార్థినిపై కూలిన చెట్టు!

కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి (Bhuvanagiri)లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆటలాడుకుంటుండగా ఒక్కసారిగా చెట్టు కొలడంతో ఒక విద్యార్థిని మృతి చెందగా ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే భువనగిరి పట్టణం లోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న భువనగిరి పట్టణానికి చెందిన మూడవ తరగతి విద్యార్థిని అలీనా (8) స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడలు ఆడుతున్న క్రమంలో అకస్మాత్తుగా చెట్టు విరిగి మీద పడడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది.

ఇదే ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల కాళ్లు విరిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇది పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపంతోనే జరిగిన ఘటనగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన భద్రత చర్యలను వెంటనే చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : తెలంగాణ ఎవ‌ని పాలైందిరో అనిపిస్తోంది: రాజ‌గోపాల్‌రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>