గోశాలలో పశుగ్రాసానికి రూ.40 వేల చెక్కు అందజేత

క‌లం, కరీంనగర్: గిరిజా గోశాల (Girija Goshala) ట్రస్ట్ ఆధ్వర్యంలో మృత్యుంజయ మహాదేవాలయం గోశాల వ్యవస్థాపక చైర్మన్ పురాణం మహేశ్వరి శర్మ సారథ్యంలో నిర్వహిస్తున్న గోశాలకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాసం కోసం రూ.40,000 చెక్కును అందజేశారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నల్ల లింగారెడ్డి తన శాఖ నిర్వహణ నుంచి రూ.40,000 చెక్కును గోశాల నిర్వాహకులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, గోశాల నిర్వాహకులు, కార్యదర్శి చల్ల మోహన్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సంఘ్యం లక్ష్మణరావు, పశుసంవర్ధక శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ నల్ల లింగారెడ్డికి, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గోవులు మనిషి జీవన విధానంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు. గోవుల ద్వారా పౌష్టికమైన పాలు, వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువు తదితర అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని తెలిపారు. రైతులకు, వ్యవసాయానికి, సమాజానికి గోవులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనిషికి సేవ చేసే మూగజీవాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గోశాల నిర్వాహకులు పేర్కొన్నారు. నోరులేని జీవులకు ఆహారం, నీరు, వైద్యం, ఆశ్రయం అందించడం ద్వారా వాటి ప్రాణాలను కాపాడటం గొప్ప మానవతా సేవ అని తెలిపారు. గోశాల నిర్వహణకు పశుగ్రాసం, వైద్యం, ఇతర అవసరాల కోసం దాతలు, ప్రజలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయాన్ని అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>