కలం, వలిగొండ: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం వలిగొండ (Valigonda) మండల తహసిల్దార్ దశరథకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఆరు డిఏ లను మంజూరు చేయాలని, పాఠశాలల మూసివేత ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్పిసి నాయకులు వెంకటేశ్వర్లు, లింగయ్య, ప్రభాకర్, జిలాని, నాగేందర్, భిక్షపతి, లింగయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
Also Read : తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డ్.. సెక్యురిటీ ఫీచర్స్ ఇవే!
Follow Us On: X(Twitter)

