కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎలక్షన్ ప్రింటింగ్ పనులతో తెలంగాణ ప్రింటర్స్‌కు లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) చొరవతో తెలంగాణ ప్రింటర్స్‌కు రూ. 100 కోట్ల పనులు లభించాయని తెలంగాణ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ (Offset Printers Association) రాష్ట్ర నాయకులు మైత్రి యాదయ్య తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ప్రింటింగ్ వర్క్‌లన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, అతని కాదని తెలంగాణ ప్రింటర్స్‌కే పనులు లభించేలా చేశామని ఆయన తెలిపారు.
గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని కేవలం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కృషివల్లే జరిగిందన్నారు. దీంతో తెలంగాణలోని 33 జిల్లా ఆఫ్‌సెట్ ప్రింటర్స్ కు లాభం చేకూరిందని ఆయన తెలిపారు. బుధవారం హైదరాబాదులో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారితో మాట్లాడి తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం చేకూరే విధంగా ప్రయత్నం చేయడం అభినందనీయమని మైత్రి ఆదాయం అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ప్రింటింగ్ పనులు ఏ జిల్లాకు సంబంధించిన పనులు ఆ జిల్లా వాళ్లకే ఇవ్వాలని మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari)కి వినతి పత్రం ఇచ్చిన వెంటనే స్పందించిన తీరుపై ప్రింటర్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ ఆఫ్సెట్ ఆసోసియేషన్ మహబూబ్ నగర్ సభ్యులు ముక్తా శ్రీశైలం, జి. శంకర్, మోహన్ సూర్య శ్రీను, నాగప్ప, చంద్రమౌళి కె. శ్రీనివాస్, బన్నప్ప, స్వామి, ప్రసాద్, నవీన్, ప్రవీణ్, సతీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మంటలు
Follow Us On: Instagram

