ఓటు డిలీట్ వివాదం.. ప్రకాశ్ రాజ్ మరో వీడియో రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల సర్ ప్రక్రియలో తన ఓటు తొలగింపు అనంతరం జరిగిన పరిణామాలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాలో మరో వీడియో పంచుకున్నాడు. ఇందులో త‌న ఓటును తీసేశార‌ని వీడియో చేసిన త‌ర్వాత అధికారులు తీవ్ర హడావిడి చేశారని చెప్పుకొచ్చారు. తాను ఆ ఓటు తొలగించారని వీడియో చేశాను కాబట్టే తన ఓటును మళ్లీ ఇచ్చారని పేర్కొన్నారు. ఓటర్ ఐడీని మొదట్లో శాశ్వతంగా మార్చినట్లు మార్క్ చేసి తొలగించినట్లు చూపించారన్నారు.

తర్వాత ఈ విషయం ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత అధికారులు సరిచేశారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు తనను సంప్రదించారని అందుకు సంబంధించిన కాల్ రికార్డులు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు తొలగింపుపై ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ని పంపి పరిసరాల్లో విచారణ జరిపించారని చెపపారు.

బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయాన్ని తన తప్పుగా చిత్రీకరించేలా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పౌరుని గౌరవాన్ని అవమానించడమేనన్నారు. ఐదేళ్లకు ఒకసారి ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎంతో ప్రాధేపడుతారు. కానీ, ఓటర్ తన ఓటు హక్కు కోసం ఎందుకు అడుక్కోవాలని అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>