బాసర గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

కలం, నిర్మల్ : బాసర గోదావరి నది (Basara Godavari River) త్రిబుల్‌ ఐటీ వాటర్‌ పంపు సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు బాసర సీఐ దీపక్‌ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని టీషర్ట్‌, నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నది నుంచి బయటకు తీయించినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు ఎస్‌హెచ్‌ఓ మొబైల్‌ నంబర్‌ 8712659540కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>