తురాటి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం తురాటి (Turati) గ్రామ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రాంపూర్ గ్రామానికి చెందిన సూర నవీన్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తురాటి గ్రామ సమీపంలోని రహదారిపై రెండు బైక్‌లు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో నవీన్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న భార్య మనోజ్ఞకు, మరో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. నవీన్ పని నిమిత్తం రాంపూర్ గ్రామం నుంచి లింబా గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>