చారకొండలో సిపిఐ ప్రచారయాత్ర

కలం, కల్వకుర్తి : ధరల పెరుగుదలను అరికట్టలేని ప్రధాని మోదీ రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల్ నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ ప్రచార యాత్ర లో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార ప్రచార యాత్రను చారకొండ (Charakonda) మండల కేంద్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతు-కూలీల సమస్యలు, విద్యా – వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని ప్రలోభాలను అరికట్టి స్వచ్ఛమైన ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అన్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రచార విధానాన్ని మారుస్తూ ప్రచారాన్ని కేవలం ప్రసార మాధ్యమాల ద్వారా చేయడానికి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దేశ పరిపాలన వ్యవస్థలో మార్పు రావాలని సెప్టెంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వేలాది మంది పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, పులిజాల పరశురాములు, ఏసారపు అశోక్, నల్ల జంగయ్య, కొండల్, చింతపల్లి అశోక్, శంకరయ్య, మర్రిపల్లి శేఖర్, జెల్ల బాలయ్య, టైగర్ సత్యం, విష్ణువర్ధన్ రెడ్డి, కుడుముల వెంకటయ్య, దేశం సైదులు,శివుడు, జోగు సైదులు, బుర్రె చిన్న అంజయ్య, అర్జునయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>