ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై పోరుబాట

కలం, నిర్మల్: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం లక్ష్మణచందా(Laxmanchanda) మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన న్యాయమైన హక్కులతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులైన పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, ఈహెచ్‌ఎస్ అమలు తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేంద్రచారి, బాలాజీ, టీఎస్‌యూటీఎఫ్ లక్ష్మణచందా మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన్న, నాయకులు వినోద్‌కుమార్, బాపిరెడ్డి, నారాయణ వర్మతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>