దేశభక్తి, ఐక్యతే లక్ష్యం: గంగాడి కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్​ : హుజురాబాద్ (Huzurabad) పట్టణంలో బుధవారం దేశభక్తిని చాటేలా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ తిరంగా ర్యాలీలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశభక్తి భావనను పెంపొందించడానికి, ప్రజల్లో జాతీయ ఐక్యతను చాటడానికే ప్రతి ఏటా ఈ మోడీ ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అభియాన్ అభియాన్‌ పేరిట ప్రోగ్రాం నిర్వహిస్తుందని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మన జాతీయ గౌరవానికి, సార్వభౌమత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాలను చేతబూని నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షులు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి కౌన్సిలర్ పంజాల మనోజ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>