ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్యాంకర్, ఏడుగురు మృతి!

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad Accident) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలోని యూటర్న్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఒక ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుండి జహీరాబాద్ వైపు వస్తున్న ట్యాంకర్ సత్వార్ సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో 14 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.మృతులందరినీ కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>