కలం, నిర్మల్: భైంసా పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్(MLA Pawar Rama Rao) రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. మంగళవారం తన నివాసంలో విగ్రహ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్‌ను శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు. భైంసా ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు పెద్ద మొత్తంలో విరాళం అందించి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సొంతంగా రూ.10 లక్షలు విరాళంగా అందించడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, విగ్రహ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

