కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి చేరుకుంటారు. అయితే, రేపటి నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ హైదరాబాద్ రానుండడం ఆసక్తికరంగా మారింది.
తొలి రోజునే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో రాష్ట్ర పాలన, ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు, విధానపరమైన అంశాలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, గత కొన్ని రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను కేసీఆర్ హాజరు కావాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. దీంతో అసెంబ్లీకి కేసీఆర్ (KCR) వస్తారా? లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: ఓడిపోయి కేసీఆర్ లాగా ఫామ్ హౌస్‌లో పడుకోవద్దు: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: X(Twitter)


