మణుగూరులో కార్డెన్ సెర్చ్.. విలువైన మద్యం స్వాధీనం

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు (Manuguru Police) పట్టణంలోని శివలింగాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రూ.35 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కేసులు నమోదు చేశారు. అలాగే వాహనాల తనిఖీల్లో 147 వాహనాలకు సంబంధించి రూ.35 వేల పాత చలాన్లను వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 13 మందిపై స్పాట్ కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్లు లేని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

​అనంతరం కాలనీవాసులతో ఏర్పాటుచేసిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ వాడకం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నేరాల నియంత్రణకు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు కొత్త వ్యక్తుల వివరాలను సరిచూసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు నాగబాబు, వేంకటేశ్వరరావు, ఎస్‌ఐలు, పోలీస్, టీజీఎస్‌పీ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>