కలం, వెబ్ డెస్క్: భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ నోట్లు (Plastic Notes) రానున్నాయి. పాలిమర్ కరెన్సీ నోట్ల ముద్రణకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. రూ. 10, రూ. 20 నోట్లు ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముందుగా 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో ట్రయల్స్ నిర్వహించనున్నామని.. ఇది విజయమైతే పూర్తి స్థాయిలో ఈ నోట్లను తీసుకొస్తామని వెల్లడించారు.
ఈ మేరకు రూ. 10, రూ. 20 పాలిమర్ కరెన్సీ నోట్ల (Plastic Notes) ముద్రణకు ఆర్బీఐ చేసిన ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయితే పాలిమర్ నోట్లు వచ్చినా అవి పేపర్ తయారైన నోట్ల స్థానంలో పూర్తిగా రావని తెలిపారు. పాలిమర్ నోట్లతో పాటు పేపర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయని తేల్చి చెప్పారు. అయితే ఈ నోట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో? ఇప్పుడే కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు.
Also Read : ‘కాక్రోచ్’ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి మరో ఉద్యమం!
Follow Us On: X(Twitter)

