కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ (Additional Collector Haripriya) పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ (Hanwada) మండల కేంద్రంలోని 2BHK ఇళ్లకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కేటాయించిన ప్రతిపాదించిన స్థలాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా హన్వాడ తహశీల్దార్ (Hanwada MRO), మండల సర్వేయర్‌తో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, భూమికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందా, భూమి విస్తీర్ణం, సరిహద్దులు తదితర అంశాలపై వివరాలను సేకరించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి, పాఠశాల ఏర్పాటుకు అనువైన స్థలంగా ఉందా అనే అంశంపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Also Read : ప్లాస్టిక్ నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన
Follow Us On: X(Twitter)

